దేశంలో నైరుతి రుతుపవనాల పురోగతి మందగించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, వర్షపాతంలో ఏకంగా 40 శాతం లోటు నమోదైంది. జూన్ 4 నుండి జూన్ 17 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సాధారణంగా 65.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 39.7 మిమీ వర్షం మాత్రమే పడింది.
ఇది దేశీయ రైతాంగానికి, ఖరీఫ్ సాగు పనులకు పెద్ద సవాలుగా మారింది. పలు వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.