గాదె సాయికృష్ణ మరణంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులే సాయికృష్ణను లాకప్‌లోనే కొట్టి చంపారని, ఆపై నిజాలను దాచిపెట్టేందుకు మృతదేహాన్ని మాయం చేశారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దేశ చరిత్రలోనే ఇంతటి అమానుషమైన లాకప్ డెత్ ఎక్కడా జరిగి ఉండదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని, మానవతా దృక్పథంతో ఆలోచించి, వెంటనే సీబీఐ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేయాలని పవన్ కల్యాణ్‌ను కోరారు.