ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన 23 ఏళ్ల రియా కుమారి ఆత్మహత్య చేసుకున్నది. ఐ లవ్ యూ అంటూ ఆమె తన పేరెంట్స్‌కు సూసైడ్ లేఖ రాసింది. 1999 కార్గిల్ యుద్ధ వీరుడి కుమార్తె ఆమె. చదువుల్లో విజయం సాధించకపోవడం వల్లే మానసిక ఆందోళనకు గురైనట్లు పోలీసు అధికారి తెలిపారు. 12వ తరగతిలో ఆమె 97 శాతం మార్కులతో స్కూల్ టాపర్‌గా నిలిచిందన్నారు. అయితే జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్ కోసం ఆమె ప్రిపేరవుతున్నది.