ఆరుట్ల గ్రామంలో ప్రారంభించుకున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ధ్వంసమైన విద్యావ్యవస్థను సంస్కరించి, వికాసం వైపు నడిపించేందుకే ఈ సరికొత్త విద్యా విధానాన్ని తీసుకువచ్చామని వివరించారు. ఆరుట్ల బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తన విద్యార్థి జీవితాన్ని తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని, ఆ పునాదితోనే ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి చేరానని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ఐఏఎస్,ఐపీఎస్ అధికారులుగా ఎదిగి తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు.