హన్మకొండలో అనారోగ్యంతో ఉన్న 17 ఏళ్ల నిరంజన్ పక్కనే కూర్చొని.. ఆత్మీయంగా పరామర్శిస్తూ, కొండంత ధైర్యం చెప్తున్న ఏపీ డిప్యూటీ సీఎం నిరంజన్ అనే బాలుడిని ఆయన నేరుగా ఇంటికి వెళ్లి కలిశారు. చిన్నప్పటి నుంచి పవన్ అంటే నిరంజన్‌కు ఎంతో ఇష్టం. తన అభిమాన నేతను ఒకసారి కలుసుకోవాలని బాలుడు ఎప్పటి నుంచో కోరుకుంటున్నాడు. బాలుడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొని, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పరామర్శ ఆ కుటుంబంలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది.