అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ చేసిన కఠిన ఫౌల్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మ్యాచ్‌లో అల్జీరియా ప్లేయర్‌పై మెస్సీ వెనుక నుంచి స్టడ్స్-అప్ ఛాలెంజ్ చేశాడు. దీంతో ఆ ప్లేయర్ నొప్పితో నేలపై పడిపోయాడు. ఇది కచ్చితంగా రెడ్ కార్డు ఇవ్వాల్సిన ఫౌల్ అని అభిమానులు మండిపడుతున్నారు. మెస్సీకి ఎల్లో కార్డు కూడా ఇవ్వకుండా వదిలేశారు. అయితే రిఫరీ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది. ‘మెస్సీ అయితే రూల్స్ మారిపోతాయా?’ అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.