రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్(టిపిఎస్) పైలాన్ సిఎం ఆవిష్కరించారు. అనంతరం స్కూల్ విద్యార్థులతో కలిసి సిఎం రేవంత్ బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఆరుట్లలో 15 కోట్ల రూపాయలతో టిపిఎస్‌ను నిర్మించారు. పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించారు. రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను నిర్మించారు.