కొత్తగూడెం జిల్లా శంభునిగూడెంకి చెందిన గర్భిణి వనజ (20)కు పురిటినొప్పులు రావడంతో గుండాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఆ సమయంలో ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేరు. దీంతో అక్కడ ఉన్న నర్స్ సాధారణ ప్రసవం చేసింది. కానీ కాన్పు తర్వాత శిశువు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శిశువు మరణించింది
మరోవైపు కాన్పు అనంతరం తల్లికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ ఆమె కూడా మరణించింది.