అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ మరోసారి అసాధారణ ప్రతిభ చాటుకున్నాడు. ఆరోసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగిన మెస్సీ.. రెండు గోల్స్‌తో రికార్డు సృష్టించాడు. మెస్సీకి ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. అమెరికాలోని కాన్సాస్ సిటీలో అల్జీరియాతో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆయన గోల్ చేయడం ద్వారా, ఐదు వేర్వేరు వరల్డ్ కప్ టోర్నమెంట్లలో గోల్స్ సాధించిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ప్రపంచకప్ కెరీర్లో మొత్తం 14 గోల్స్ పూర్తి చేసుకున్నారు.