చిప్స్ ప్యాకెట్, చాక్లెట్లు పిల్లలకు చాలా ఇష్టమైన తినుబండారాలు చిప్స్ ప్యాకెట్లలో మిని క్రియేచర్ బొమ్మలు పెట్టి సేల్స్ పెరిగేలా చేసుకుంటున్నాయి. అయితే, ఈ ప్లాస్టిక్ బొమ్మలు మాత్రం చిన్నారుల ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా, చిప్స్ ప్యాకెట్ లో వచ్చే బొమ్మ గొంతులో ఇరుక్కుని ఓ బాలుడు మరణించాడు. అనంతపురం జిల్లా గుత్తిలో బాలుడు ఫర్హాన్ (5) చిప్స్ ప్యాకెట్ తింటుండగా అందులోని బొమ్మ గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక ఇబ్బంది పడిన బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు.