గ్రేటర్ నోయిడాలో ఇంట్లో పనిచేసే మహిళపై యజమాని దాడికి పాల్పడ్డారు. నోయిడాలోని గౌర్ సిటీలో గల 11th అవెన్యూ అపార్టుమెంట్ కాంప్లెక్స్‌లో ఈ దాడి ఘటన స్నబ్బిట్ (Snabbit) అనే ఇన్‌స్టాంట్ యాప్ ద్వారా క్షణాల్లో సిటీ అంతా పాకింది. దాంతో సిటీలోని పనిమనుషులంతా కలిసి బాధితురాలికి న్యాయం జరిగేదాకా పనులు చేయవద్దని నిర్ణయించుకున్నారు. అపార్టుమెంట్ కాంప్లెక్స్ ముందు ఆందోళనకు దిగారు. పనిమనుషులు సేవలు నిలిపేయడంతో గౌర్ సిటీతోపాటు పరిసర ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.