మిత్రదేశమైన అమెరికా కంటే ఇజ్రాయెల్ భద్రతే తమ తొలి ప్రాధాన్యం అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు తెలిపారు.ఆ ఒప్పందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందమని అన్నారు. అవసరం అనిపిస్తే ఇరాన్, లెబనాన్ పై దాడులు చేస్తూనే ఉంటామని, ఆ అంశంలో ట్రంప్ తో విభేదాలు వస్తుంటాయని తెలియజేశారు. తాము ఇరాన్- అమెరికా ఒప్పందంపై కట్టుబడి ఉండమని, ఇరాన్ కు అణ్వాయుధాలు ఉండకుండా అడ్డుకుంటామని సూచించారు.ఇరాన్ కు అణ్వాయుధాలు లభించకుండా అడ్డుకోవడం తమ విధానమని, అని నెతన్యాహు పేర్కొన్నారు.