రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలని, కానీ విధానపరంగానే ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి, వైసిపి నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు పవన్ రీకౌంటర్ ఇచ్చారు. మహిళల గురించి మాట్లాడుటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మహిళల కట్టుబొట్టు గురించి మాట్లాడే స్థాయికి వైసిపి నేతలు దిగజారిపోయారన్నారు. కేవలం అనితను అన్నట్టు కాదని మహిళలందరినీ కించపరిచినట్లేనని మండిపడ్డారు.