విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి ఆమె భర్తతో కలిసి ముస్సోరిలోని హోమ్‌స్టేలో వున్నారు సోమవారం గదిలో అనుమానాస్పద పరిస్థితుల్లో గాయత్రి మృతదేహం నగ్నంగా లభ్యమైంది. మంచంపై రక్తపు మరకలు కనిపించాయి. సంఘటనా స్థలం నుంచి ఖాళీ మద్యం సీసాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆమె తన భర్త సౌమ్య శ్రీచరణ్‌తో కలిసి పర్యటనకు వచ్చింది. వారికి ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. ఉదయం నిద్రలేచి చూసేసరికి తన భార్య అపస్మారక స్థితిలో పడి ఉందని భర్త చెబుతున్నారు.