ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఇళ్లు, ఆస్తులపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాతబస్తీలోని ఛత్రినాకలో ఉన్న నరహరి నివాసంతో పాటు ఆయన ఆఫీసు, బంధువుల ఇళ్లు, సన్నిహితుల ఇళ్లు సహా మొత్తం 11 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో మెరుపు దాడులు చేశారు. దాదాపు 1.10కోట్ల నగదును ఏసీబీ గుర్తించింది. పడక గదిలో బెడ్ కింద నగదు స్వాధీనం చేసుకున్నారు. నగదు, బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్, రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.