సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో భేటీ అయ్యారు. అరగంట పాటు ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటం, ఏఐ, వర్సిటీల్లో పరిశోధనలకు సహకారం అందించాలని సీఎం కోరారు. సెమీకండక్టర్ల తయారీ ఎకో సిస్టమ్, కెపాసిటీ బిల్డింగ్‌లో తోడ్పాటు ఇవ్వాలన్నారు. ఏపీలోని నగరాలు, పట్టణాలు అర్బన్ గవర్నెన్స్‌లోనూ సహకారం కోరారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం ద్వారా పంటలు పండిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.