సోషల్ మీడియా వాడకంపై బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతను రక్షించే లక్ష్యంతో 16 ఏండ్ల లోపువారికి సోషల్ మీడియా సైట్లను ఉపయోగించకుండా పూర్తిగా నిషేధించనుంది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సోమవారం ప్రకటించారు.గేమింగ్, లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లపై కూడా కఠినమైన ఆంక్షలు విధించనున్నట్లు స్పష్టం చేశారు. పిల్లల క్షేమం దృష్ట్యా ఈ పూర్తి నిషేధమే సరైన నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రుల విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాతే బ్రిటన్ ప్రభుత్వం ముందడుగు వేసింది.