భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఫ్రాన్స్ లోని నైస్ నగరంలో సమావేశమయ్యారు సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచేలా సరికొత్త వ్యూహాలను ప్రకటించారు. ఈ చర్చల్లో భాగంగా ‘ఇండియా-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్‌మ్యాప్ 2030’ తో పాటు మొత్తం 13 కీలక ఫలితాలను ఇరు దేశాలు వెల్లడించాయి. AI అభివృద్ధి కోసం ఉమ్మడి వర్కింగ్ గ్రూపును కూడా ఏర్పాటు చేశారు. భారత యూపీఐ (UPI) చెల్లింపుల వ్యవస్థను ఫ్రాన్స్ దేశంలో మరింత విస్తరిస్తామని నేతలు ప్రకటించారు.