అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ఒప్పందం పశ్చిమ ఆసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికి, శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే అంతర్జాతీయ వాణిజ్యం, నౌకాయాన రాకపోకలకు ఈ ఒప్పందం ఊతమిస్తుందని పేర్కొన్నారు. SM ‘ఎక్స్’లో స్పందిస్తూ, అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని హర్షిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ ఆసియాలో కొనసాగిన ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపాయని ఆయన అన్నారు.