ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీని భారత మహిళా జట్టు ఘనంగా మొదలెట్టింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 64 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది భారత జట్టు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. 171 పరుగుల లక్ష్యఛేదనలో 17 ఓవర్లలో 106 పరుగులకి ఆలౌట్ అయ్యింది పాకిస్తాన్ మహిళా జట్టు. వైస్ కెప్టెన్ స్మృతి, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.