శివసేన సీనియర్ నాయకుడు, సంజయ్ రౌత్ ప్రధానమంత్రి మోదీని తీవ్ర విమర్శలు గుప్పించారు. “మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు జన్మించిన గుజరాత్‌లోని దాహోద్ ప్రాంతంలోనే ప్రధాని మోదీ కూడా పుట్టారు. అంటే ఇద్దరూ ఒకే మట్టి నుంచి వచ్చినవారే కదా?” అని ఆయన ప్రశ్నించారు. మోదీ రాజకీయ శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రౌత్.. ఆయన్ను ఒక ‘అఘోరి’గా, అత్యంత ‘కఠిన హృదయుడైన వ్యక్తి’గా అభివర్ణించారు. దేశ రాజకీయ చరిత్రలో ఇంతటి క్రూరమైన మనస్తత్వం ఉన్న నేతను తాను ఎన్నడూ చూడలేదంటూ మండిపడ్డారు.