గాజులరామారం-జీడిమెట్ల ప్రాంతంలోని హెచ్ఏఎల్ ఏరియాలో అద్దె ఇంట్లో ఉన్న ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను అరెస్టు చేశారు. కొన్ని రోజులుగా వీరు అక్రమంగా నివసిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులకు అక్కడికి వెళ్లి సోదాలు నిర్వహించారు. అక్కడ ఉన్న ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకుని విచారించగా భారతదేశంలో ఉండేందుకు ఎలాంటి పాస్‌పోర్టులు, వీసాలు ,ఇతర ప్రయాణ పత్రాలు లేవని పోలీసులు తెలిపారు . భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని వివరించారు.

