హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి నైరుతి వాన దంచికొడుతోంది. సాయంత్రం వరకు సాధారణంగా ఉన్న వాతావరణం రాత్రికి ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో భారీ వర్షం పడుతోంది. గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, కొత్తగూడ చౌరస్తా, బోరబండ, అమీర్ పేట, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. వర్షం ధాటితో పలు ఏరియాల్లోని రోడ్లపై భారీగా నీరు నిలుస్తోంది. దీంతో రోడ్లపై ఉన్న వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు మార్గాల్లో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.