సింగరేణి సంస్థ జైపూర్ లో చేపడుతున్న పవర్ ప్లాంట్ నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఈ ప్లాంట్ ఆలస్యమవుతున్న కొద్దీ ఏడాదికి రూ.750 కోట్ల భారం, అంటే రోజుకు సుమారు రూ.రెండున్నర కోట్ల నష్టం వస్తోందన్నారు. తెలంగాణలో ఉన్న ఎన్టీపీసీ అతి తక్కువ ధరకే విద్యుత్తు ఇస్తానంటే.. సింగరేణి సంస్థ ఎక్కడో జైపూర్లో ఎందుకు పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని ప్రశ్నించారు. డీపీఆర్ కు అనుమతులే ఇవ్వలేదని, విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందం జరగకపోయినా టెండర్లు పిలిచినట్లు మండిపడ్డారు.