భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారులు తండ్రి బాటలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పెద్దబ్బాయి సమిత్ జూనియర్ స్థాయిలో, టీ20 లీగుల్లో రాణిస్తుండగా.. చిన్న కుమారుడు అన్వయ్ అండర్ -19 జట్టులోకి వచ్చేశాడు. మూడు దశాబ్దాల క్రితం ద్రవిడ్ అండర్ 19లో ఆడగా.. ఇప్పుడు అబ్బాయి అతడి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడు. శ్రీలంకతో సిరీస్‌కు ఎంపిక చేసిన స్క్వాడ్‌లో అన్వయ్ చోటు దక్కించుకున్నాడు.