రానున్న రోజుల్లో వైఎస్ జగన్ ఏపీలో టీడీపీకి రాజకీయ సమాధి కట్టడం ఖాయమని మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యిందని, ఈ రెండేళ్లలో సూపర్ సిక్స్ హామీల్లో ఎన్ని హామీలు నెరవేర్చారని ప్రశ్నించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ఇస్తామని చెప్పారని, ఏడాదికి రూ.18,000 చొప్పున ఇప్పటి వరకు మొత్తం ప్రతి మహిళకు రూ.36,000 బాకీ ఉన్నారని చెప్పారు.