లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ర్యాపర్ వేదన్‌కు TVK, DMK పార్టీలు రాజకీయ అవకాశలు కల్పించడంపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తీవ్రంగా మండిపడ్డారు. మీటూ ఉద్యమం సమయంలో పలువురు మహిళలు వేదన్‌పై లైంగిక ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తికి ప్రధాన రాజకీయ పార్టీలు వేదిక ఇవ్వడం బాధితులను మరింత కించపరిచినట్లేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.