విజయ్, సంగీత దంపతులు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి మళ్లీ ఒక్కటయ్యారనేది ఇప్పుడు వైరల్‌గా మారింది.
విజయ్ దంపతులు మళ్లీ కలవడానికి వారి కుటుంబ సభ్యులే కీలక పాత్ర పోషించారని సమాచారం. ముఖ్యంగా విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ చొరవ తీసుకుని, ఇరుపక్షాలతో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సంగీత లండన్ నుండి చెన్నైకి తిరిగి వచ్చారని, ఈ జంట ప్రస్తుతం కలిసి సమయం గడుపుతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.