పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లో ఉద్రిక్తతలు మరోసారి పతాక స్థాయికి చేరాయి. స్థానిక ప్రజలు చేపట్టిన శాంతియుత నిరసనలపై పాకిస్థాన్ భద్రతా బలగాలు జరిపిన తాజా కాల్పుల్లో మరో 16 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటికే 30 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 46కు చేరుకుంది. భద్రతా దళాలు టియర్ గ్యాస్, లైవ్ ఫైరింగ్‌తో విరుచుకుపడుతుండటంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాక్ ప్రభుత్వ అణచివేత ధోరణిపై అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.