పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు దాదాపు నియంత్రణ దాటిపోయాయి. ఇరాన్ సైనిక కమాండ్ గురువారం నాడు అత్యంత సంచలన మరియు ప్రమాదకరమైన ప్రకటన చేసింది. అంతర్జాతీయ చమురు, వాణిజ్య రవాణాకు గుండెకాయ లాంటి వ్యూహాత్మక జలమార్గం ‘హార్ముజ్ జలసంధి’ని అన్ని రకాల నౌకల ప్రయాణానికి పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, ఈ ఆంక్షలను ఉల్లంఘించి ఆ జలసంధి గుండా ప్రయాణించే ఏ నౌకనైనా తాము నిర్ధాక్షిణ్యంగా లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తామని ఇరాన్ సైన్యం ప్రపంచ దేశాలను తీవ్రంగా హెచ్చరించింది.

