ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టు ప్రకటించింది. అమరావతిలో రూ.2,534 కోట్ల వ్యయంతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టనుంది. ఈమేరకు సీపీడబ్ల్యూడీ ప్రతిపాదనలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం రూ.1,299.08 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల కోసం రూ.1,234.91 కోట్లు వెచ్చించనుంది. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం కోసం సీఆర్‌డీఏ 22.53 ఎకరాలు కేటాయించింది.