ఆఫ్ఘనిస్తాన్‌లోని కునార్, ఖోస్ట్, పక్తికా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సేనలు ఈ దాడులకు తెగబడ్డాయి. పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే అమాయక పౌరుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘోర కలియుగంలో మరణించిన 19 మందిలో 11 మంది చిన్న పిల్లలు ఉండటం అత్యంత విచారకరం. మొదట మృతుల సంఖ్య 13గా ఉన్నప్పటికీ.. శిథిలాల కింద మృతదేహాలు లభ్యమవడంతో ఆ సంఖ్య మరింత పెరిగింది.