తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, బిదాన్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ సబ్యసాచి దత్తపై కోడిగుళ్లతో అటాక్ చేశారు. బిదాన్నగర్ పోలీసు స్టేషన్లోనే ఈ ఘటన జరిగింది.బెదిరింపుల కేసులో ఆ మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. వ్యాపారి నుంచి సుమారు కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో దత్తపై గుడ్లు, ఆవుపేడ, టమోటాలతో అటాక్ చేశారు.కోర్టు వద్ద మరో గ్రూపు కూడా దొంగ దొంగ అంటూ కేకలు వేశారు.

