భారతీయ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో దక్షిణ భారత సినీ పరిశ్రమ ఒక గొప్ప దర్శకుడిని కోల్పోయిందంటూ సినీ ప్రముఖులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.