హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి అయిపోయారు. పాతబస్తీలో ఇద్దరు యువకులు కరెంటు షాకుతో మరణించారు. ఇవాళ వచ్చిన భారీ వర్షం వల్ల సిటీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ కరెంటు తీగలు పడిపోయాయి. వర్షంతోపాటూ.. ఈదురుగాలులు కూడా వీచాయి. దాంతో.. చాలా చోట్ల వైర్లు తెగి.. నేలపై పడిపోయాయి. దాంతో.. కరెంటు పాసయ్యే పరిస్థితి వచ్చింది. పాతబస్తీలో ఆటో దిగిన యువకులు.. దారిలో వెళ్తూ ఉండగా.. వారిద్దరికీ కరెంటు తీగలతో కరెంటు షాక్ తగిలింది. స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే, వారిద్దరూ చనిపోయారని తెలిసింది.