రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ మోహన్ నాయక్ వెనకేసిన అక్రమాస్తుల విలువ ప్రభుత్వ మార్కెట్ ధరల ప్రకారం రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తేలింది. సుమారు రూ.65 లక్షల నగదు, 1.5 కేజీల బంగారం, ఖరీదైన లగ్జరీ కార్లు, బినామీల పేరిట ఉన్న ఇళ్లు, స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు వివిధ బ్యాంకు ఖాతాల వివరాలు, లాకర్ల కీలు, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన కొన్ని అనుమానాస్పద డైరీలు, సేల్ డీడ్లను ఏసీబీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.