దేశంలో ఆర్థిక వృద్ధి రేటు (GDP) పరుగులు పెడుతోందని గణాంకాలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబులు మాత్రం ఖాళీ అవుతున్నాయి. దేశంలోని పట్టణ ప్రాంతాల ప్రజలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ అవకాశాలు, ఆదాయ వృద్ధి , ఖర్చుల విషయంలో తీవ్ర అసంతృప్తితో, ఆందోళనతో ఉన్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజా సర్వేలో తేలింది. దేశంలోని 19 ప్రధాన నగరాల్లోని 6,086 మంది అభిప్రాయాల ఆధారంగా ఆర్బీఐ ఈ సర్వేను మే 2 నుంచి 11 మధ్య నిర్వహించింది.