కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిసిన రెబల్ ఎంపీల బృందంలో బరంహపూర్ ఎంపీ, మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ పేరు కూడా వినిపిస్తుండటంతో ఆమె మండిపడ్డారు. “యూసఫ్ పఠాన్.. నీకెంత ధైర్యం? అమిత్ షా పిలిచారని ఢిల్లీకి పరిగెత్తావా? భారతదేశం తరఫున ఆడిన క్రికెటర్‌గా నిన్ను గౌరవించి మా జిల్లా ఓటర్లు భారీ మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు అదే ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఇలా పార్టీ ఫిరాయించడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా?” అని మొయిత్రా నిలదీశారు.

