దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అలర్ట్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రతిష్టాత్మక NEET UG 2026 రీ-ఎగ్జామ్ కు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను ఆదివారం అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించి https://neet.nta.nic.in పోర్టల్ ద్వారా ఎగ్జామ్ సిటీ అల్లాట్‌మెంట్ వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.