భారత్‌కు సంబంధించిన ఒక అంతర్జాతీయ వార్తా కథనాన్ని పంచుకుంటూ ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. “భారతదేశంలో జననాల రేటు ఇప్పటికే రీప్లేస్‌మెంట్ స్థాయి కంటే దిగువకు పడిపోయింది. ముఖ్యంగా విద్యావంతులైన వర్గాలలో ఈ సంతానోత్పత్తి రేటు రీప్లేస్‌మెంట్ లెవెల్ కంటే కిందికి చేరింది.” మస్క్ షేర్ చేసిన డేటా ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో సంతానోత్పత్తి రేటు ఏకంగా 1.2 కి పడిపోయింది. ఇది ప్రపంచంలోనే అత్యల్ప జననాల రేటు ఉన్న ఫిన్లాండ్ దేశ సగటు కంటే తక్కువ కావడం గమనార్హం.