సీఎం చంద్రబాబు పార్టీ క్లస్టర్ ఇంఛార్జ్ లతో సమావేశం అయ్యారు. ఇకపై పార్టీకి ఓటమి లేదు… రాదు అని ధీమాగా చెప్పిన చంద్రబాబు…ఆ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని వివరించారు. రాష్ట్ర, పార్టీ శ్రేయస్సు కోసం తప్పులు చేసిన వాళ్లని, తేడాగా ఉన్నవాళ్లని వదిలించుకుంటానని.. ఎన్నికల్లో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఏం ప్రచారం చేశారో… అవన్నీ ప్రభుత్వం చేస్తోందన్నారు. పార్టీ పదవులు మొదలుకుని టిక్కెట్ల కేటాయింపుల వరకు నిరంతరం సర్వేలు చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.