దిల్లీలో హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో వంట మనిషి నిర్లక్ష్యం వల్లే అగ్నిప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. వంటగదిలో ఎలక్ట్రిక్ స్టవ్ ఆన్ చేయగానే అది పేలిపోయిందని ఘటన తర్వాత కుక్ ఓ మీడియాతో పేర్కొన్నారు. ఆ తర్వాత హోటల్ మెయిన్ పవర్ను ఆఫ్ చేసి.. తనని తాను రక్షించుకునేందుకు బయటకు పరుగులు తీసినట్లు వెల్లడించాడు. నేగి విద్యుత్ సరఫరా ఆపేయడంతో.. హోటల్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయక తలుపులు లాక్ అయిపోయాయని దర్యాప్తులో తేలినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.