మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం పెద్ది విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో థియేటర్ ప్రాంగణాలు ఇప్పటికే రామ్ చరణ్ భారీ కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో కళకళలాడుతున్నాయి. పలుచోట్ల అభిమానులు బాణాసంచా కాలుస్తూ, తీన్మార్ డ్యాన్సులు చేస్తూ సందడి చేస్తున్నారు. కటౌట్లకు పాలాభిషేకాలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.