కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ -2025పై సీబీఐ విచారణకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిపించి, అన్నింటా సక్సెస్ అయిన అనేక మంది డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు రాకపోవడం అత్యంత హేయమని మండిపడ్డారు. పలువురు డీఎస్సీ అభ్యర్థులతో వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమావేశమయ్యారు. వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే, విచారణ కమిషన్ ఏర్పాటు చేసి.. ఈ అక్రమాలపై దర్యాప్తు జరుపుతామని, అన్యాయానికి గురైన అభ్యర్థులకు అవసరమైతే అదనపు పోస్టులు ఇస్తామని జగన్ ప్రకటించారు.