ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్, ఇన్ స్టా ఖాతాల్ని ఓసారి బ్లాక్ చేయించి, మళ్లీ రిలీజ్ చేయించిన కేంద్రం..ఇవాళ మరోసారి కొరడా ఝళిపించింది. ఈ నెల 6న అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చి నిరసనలకు దిగుతానంటూ CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే చేసిన ప్రకటనే ఇందుకు కారణం. గత కొన్ని రోజులుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని మోడీతో పాటు పలువురు బీజేపీ పెద్దల రాజీనామాలు కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ హ్యాండిల్ పై పోస్టులు పెడుతోంది. ఇవాళ తమ పార్టీ తరఫున ముగ్గురు అధికార ప్రతినిధులు నియమిస్తున్నట్లు కూడా ప్రకటన చేసింది.