నాగోల్ నుంచి రాయదుర్గం వైపు వెళ్లే మెట్రో ట్రైన్లో రెండ్రోజుల క్రితం చైతన్య అనే ప్రయాణికుడు అతడు తన కాలును మెట్రో కిటికీ అద్దంపై ఆనించి అనాగరికంగా కూర్చొని అడిగిన తోటి ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించిన అతనికి మెట్రో నిబంధనలు ఉల్లంఘించినందుకు చట్టం ప్రకారం రూ.250 జరిమానా విధించినట్లు వెల్లడించారు. కేవలం రూ.250 జరిమానా విధించడం చాలా తక్కువని, ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తులను మళ్లీ ఎప్పుడూ మెట్రో రైళ్లలోకి రాకుండా జీవితకాలం నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.