హైదరాబాద్‌లో దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన యువతి మెడికవర్ ఆస్పత్రిలో అకౌంటెంట్‌గా పనిచేస్తుంది. కొంతకాలంగా బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు తాళలేకనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. కూతురు రోజా రమణి (26) కనిపించడం లేదని నాగోల్‌కు చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన యువతి రోజా రమణిగా నిర్ధారించారు.