గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో 7 మంది సజీవ దహనమయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ధూలే నుంచి నవాపూర్ మీదుగా సూరత్‌కు వెళ్తున్న మహారాష్ట్ర ఎస్టీ బస్సు జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ధాటికి బస్సు సెంట్రల్ డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న మరో మహారాష్ట్ర బస్సును ఢీకొట్టింది. బస్సుల్లో ఒకటి పలుమార్లు పల్టీలు కొట్టి మంటల్లో కాలిపోయింది.