ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల తన నివాసంలో ఈరోజు (జూన్ 2) సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మధ్య మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ పోలీసులు కనీసం ఈ ప్రెస్‌మీట్‌కైనా అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. “ఏం జరుగుతుందో చూద్దాం” అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.