పింఛన్లు పంపిణీ సభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు బటన్ నొక్కటంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా బటన్ నొక్కవచ్చని.. కానీ, నేరుగా పేదవాడి ఇంటికి వచ్చి పింఛన్ అందించినప్పుడు, అధికారులు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని పరిశీలించినప్పుడు కలిగే ఆనందం.. బటన్ నొక్కితే ఉండదని చెప్పుకొచ్చారు. తంలో ఏదైనా కారణంతో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే.. వెంటనే రద్దు చేసేవారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల పింఛన్ ఒకేసారి తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు.